Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, జూన్19 : బడిబాట కార్యక్రమంలో బాగంగా మండలంలోని తారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఒకటో తరగతిలో నూతనంగా ఎనిమిది మంది విద్యార్థులు నమోదు ఆయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎం లు శ్యాంసుందర్ రెడ్డి, రాజేందర్, రమేశ్, సర్పంచ్ గాజనవేన స్వరూప సదయ్య, ఉప సర్పంచ్ స్వామి, పంచాయతీ కార్యదర్శి సందీప్, అంగన్వాడీ సూపర్వైజర్ సావిత్రి, టీచర్లు రాజమణి, శ్రావణి, సీఆర్పీ ఉయ్యాల వీరయ్య, ఉపాధ్యాయ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.