రేగుపండ్లు తెంపుతూ..
రేగుపండ్లు తెంపుతూ బావిలో పడి ఓ బాలుడు మృత్యువాతపడ్డాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో బుధవారం వెలుగుచూసిన ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లారెడ్డిపల్లికి చెందిన ఈర్నాల శారద-శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక్కగానొక్క కొడుకు రాజు (12) ఉన్నారు. రాజు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం పాఠశాలకు వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఆడుకుంటూ మధ్యాహ్నం బయటకు వెళ్ళాడు.
- బావిలోపడి బాలుడి మృత్యువాత
వీణవంక, ఫిబ్రవరి 11 : రేగుపండ్లు తెంపుతూ బావిలో పడి ఓ బాలుడు మృత్యువాతపడ్డాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో బుధవారం వెలుగుచూసిన ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లారెడ్డిపల్లికి చెందిన ఈర్నాల శారద-శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక్కగానొక్క కొడుకు రాజు (12) ఉన్నారు. రాజు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం పాఠశాలకు వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఆడుకుంటూ మధ్యాహ్నం బయటకు వెళ్ళాడు.
సుమారు ఒంటిగంట ప్రాంతంలో ఊరి చివరలోని బావిపక్కన ఉన్న రేగుచెట్టు వద్దకు వెళ్ళి చెప్పులు విడిచి పండ్లు తెంపుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయాడు. బాలుడు ఎంతకూ ఇంటికి రాకపోయేసరికి సాయంత్రం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెతికారు. బావి పక్కన చెప్పులు విడిచి ఉండడాన్ని గమనించిన స్థానికులు అందులో మంగళవారం రాత్రి వరకు వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం శవమై కనిపించగా.. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. బాలుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ తిరుపతి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- boy died
- Karimnagar
- well
RELATED ARTICLES
తాజా వార్తలు
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
TOMCOM | టామ్కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

