Chigurumamidi | చిగురుమామిడి, ఫిబ్రవరి 3 : రాబోయే వేసవికాలంను దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణకు గాను ముందస్తుగా గ్రామాల్లో సందర్శించి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎంపీడీవో విజయ్ కుమార్ తెలిపారు. చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్, పీచుపల్లి గ్రామంలో సర్పంచ్ సాంబారి భారతమ్మ, పీచు సత్యనారాయణ రెడ్డి, వార్డు సభ్యులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. గ్రామంలో ఉన్న బోరు బావులు, వాటర్ ట్యాంకులు, మోటార్లు పైప్ లైన్లు, వాటి పనితీరు పరిశీలించారు.
నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించారు. పనిచేయని మోటార్లకు వెంటనే మరమ్మతులు, లీకేజీలు ఉన్న పైపులైన్లను సరిచేయాలని, నీటి సరఫరా సక్రమంగా జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ కార్యదర్శి, గ్రామపంచాయతీ సిబ్బందికి సూచించారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా మండలంలోనీ గ్రామాలను పరిశీలించి ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు సాంబారి భారతమ్మ, పీచు సత్యనారాయణరెడ్డి, ఉప సర్పంచ్ లు పైడిపల్లి వెంకటేష్, సదానంద చారి, మాజీ ఎంపీటీసీ సాంబారి కొమురయ్య, ఇంచార్జ్ ఎంపీఓ ఖాజామొహీనుద్దీన్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జ్ఞానేశ్వరి, పంచాయతీ కార్యదర్శులు స్వప్న, క్షమారాణి, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.