పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
దివ్యాంగులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్లాల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో స్త్రీ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన దివ్యాంగుల ర్యాలీని ఆయన ప్రారంభించి, మాట్లాడారు.
- అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్లాల్
- దివ్యాంగుల ర్యాలీ ప్రారంభం
కలెక్టరేట్, డిసెంబర్ 3: దివ్యాంగులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్లాల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో స్త్రీ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన దివ్యాంగుల ర్యాలీని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా, ర్యాలీ మహాత్మా జ్యోతిబా ఫూలే మైదానం నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సబితా కుమారి, డీఆర్డీవో శ్రీలత, మెప్మా పీడీ రవీందర్, దివ్యాంగుల సంక్షేమ సంఘం బాధ్యులు వెన్నం శ్రీనివాస్, జకం సంపత్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
లఘు చిత్రాలను ప్రోత్సహించాలి
కమాన్చౌరస్తా, నవంబర్ 3: తకువ నిడివిలో సమాజ ఉపయోగకర సందేశాలిచ్చే లఘు చిత్రాలను అందరూ ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ కోరారు. నగరంలోని ఫిలింభవన్లో కఫిసో ఆధ్వర్యంలో చిన్నితెర కార్యక్రమంలో భాగంగా అనసూరి భూనాథాచారి దర్శకత్వంలో వచ్చిన గోదారి ఫిల్మ్స్ వారి ‘అధర్వ’, రాము మొగిలోజు దర్శకత్వం వహించిన మన విలేజ్ సినిమా వారి ‘ఆరు గజాల చీర’ చిత్రాల ప్రదర్శనకు శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్రాలను విడుదల చేసి మాట్లాడారు. నేటి కాలంలో మంచి లఘు చిత్రాలను యువ దర్శక, నిర్మాతలు తీసుకొస్తున్నారన్నారు. సమాజం మెచ్చే సందేశాత్మక చిత్రాలకు సముచిత స్థానం దకుతుందని చెప్పారు. చిత్రాల బాధ్యులను అభినందించారు. కఫిసో అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి లక్ష్మీ గౌతమ్, నాగభూషణం, మహేశ్, వెంకటేశ్వర్ రావు, నార్ల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

