Huzurabad | హుజురాబాద్, జనవరి 2 : పార్టీ పటిష్టతకు కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మల రెడ్డి సూచించారు. బీజేపీ నాయకుడు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో హుజురాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకునే విధంగా కార్యకర్తలు అందరూ కలిసి పని చేయాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్లాలని కోరారు.
ఓటర్ జాబితా అనంతరం అవకతవకలపై మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, పట్టణ మాజీ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు, తాజా మాజీ కౌన్సిలర్ వెంకటరెడ్డి, నల్ల సుమన్, మెరుగు రాజిరెడ్డి, కేసరి శేషయ్య, మాజీ సర్పంచ్ పోతుల సంజీవ్, పల్లె వీరయ్య, గూడూరి రామ్ రెడ్డి, శక్తి కేంద్రం ఇంచార్జిలు, బూత్ అధ్యక్షు,లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.