Actions | ఎల్లారెడ్డిపేట, జూలై 31: గుడుంబా తయారీ, విక్రయం, రవాణాలాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. గురువారం మండలంలోని పలు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి గుడుంబా, తయారీకి ఉపయోగించే ముడి సరుకులను పట్టుకున్నట్లు తెలిపారు.
కిష్టునాయక్ తండా ,అల్మాస్పూర్ తండా, బుగ్గ రాజేశ్వర తండాలలో దాడులు నిర్వహించి 300 లీటర్ల పానకం ధ్వంసం చేసి, 20 కిలోల బెల్లం 10 కిలోల పటిక, 20 లీటర్ల గుడుంబా స్వాధీనపరచుకున్నట్లు చెప్పారు. ఇందుకు కారణమైన వారిపై మూడు కేసుల నమోదు చేసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. గుడుంబా తయారీకి సంబంధించిన సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఈ దాడుల్లో డీటీఎఫ్ ఎస్ఐ శైలజ, సిబ్బంది రాజు, కిషోర్, మల్లేష్, వర్మ, హమీద్, సుమన్, రాకేష్ పాల్గొన్నారు.