కమాన్చౌరస్తా, మార్చి 12 : విద్యార్థులు శ్రద్ధతో చదివి పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థులకు సూచించారు. బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలాజీ సేవా సమితి ఆధ్వర్యంలో కరీంనగర్లోని 20 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 700 మం ది విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేస్తున్నారని తెలిపా రు. ఈ సంస్థ సేవలు అభినందనీయమన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలోనూ ఈ సేవలు విస్తరింపచేయాలని సేవాసమితి సభ్యులను కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ అల్పాహారం తిన్నారు. జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ప్రధానోపాధ్యాయు డు రాజేందర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
గంగాధర, మార్చి 12 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూ పాలని కలెక్టర్ పామేలా సత్పతి సూచించారు. మం డలంలోని గట్టుభూతూర్లో ఇటుక బట్టీల కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన వర్సైట్ పాఠశాలను బుధవారం సందర్శించారు. వి ద్యార్థులతో వారి మాతృభాషలోనే మాట్లాడి ఉత్సాహపరిచారు. విద్యార్థులకు బ్యాగులు, ట్రాక్ సూట్లో అందజేయాలని డీఈవోకు సూచించారు. అనంతరం ఉన్నత పాఠశాలలోని ఆరో తరగతి విద్యార్థులకు విద్యా బోధన చేసి, ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కార్యక్రమంలో జిల్లా వి ద్యాధికారి జనార్దన్ రావు, మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు, ఏఎంవో అశోక్ రెడ్డి, ఎంపీడీవో రాము, హెచ్ఎం సత్య ప్రకాశ్, చంద్రకళ పాల్గొన్నారు.