ACB Raids | ఓదెల, మే 7 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం, పొత్కపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి కుమారస్వామి, ఓ వ్యక్తి నుండి ఇంటి పర్మిషన్ కోసం ఫోన్‌పే ద్వారా రూ.5 వేల లంచం తీసుకున్నట్టు ఆరోపిస్తున్నారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు పొత్కపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శిని అదుపులోకి తీసుకొని, రికార్డులు ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. తనిఖీల్లో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్, సీఐ తిరుపతి తదితరులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.