Aadi Srinivas | రుద్రంగి, జూన్ 11: మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని మార్కెట్ కమిటీ చెర్మన్ చెలుకల తిరుపతి డిమాండ్ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి బుధవారం విలేకరులతో మాట్లాడారు.
గతంలో ఎప్పుడైనా మున్నూరు కాపు సామాజిక వర్గానికి మంత్రి వర్గంలో సముచిత స్థానం ఉండేదని, నేడు ప్రజా ప్రభుత్వంలో మున్నూరు కాపులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అనునిత్యం ప్రజల కోసం కృషి చేస్తున్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మంత్రి వర్గంలో చోటు కల్పించాలని కోరారు.