గంగాధర, ఫిబ్రవరి 11: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు మండలంలోని తాడిజెర్రి గ్రామానికి చెందిన్నా శ్రీరాం మహేష్ (35) దుబాయ్ లో పనిచేస్తూ 10 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. భార్య పిల్లలతో కలిసి మధురనగర్ చౌరస్తాలో కిరాయికి ఉంటున్నాడు. మంగళవారం రాత్రి ఉప్పరమల్యాల రంగరావుపల్లి గ్రామాల మధ్య మహేష్ బైక్పై వాహనం రోడ్డుపై పడి ఉండగా మహేష్ రోడ్డు ప్రక్కన పొలంలో పడి ఉన్నాడు.
వాహనం అదువు తప్పిందా లేక ఏదైనా వాహనం ఢీకొందా తెలియలేదు. తీవ్రంగా గాయపడిన మహేష్ ను స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో కరీంనగర్ హాస్పిటల్కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మహేష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. ప్రమాదంపై ఫిర్యాదు రాలేదని, వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు.