Road Accident | జగిత్యాల : ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడి యువకుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చెదలు ప్రవీణ్ (30) తన కొడుకుతో కలిసి వ్యవసాయ పొలంలో పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నాడు.
కాగా మూల మలుపు వద్ద అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడడంతో యువ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కొడుకు శ్రీ హాన్ (10) పక్కన ఉన్న పొలంలో పడటంతో కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.