Sircilla | రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 22 ( నమస్తే తెలంగాణ) : అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని, సిరిసిల్ల లో 8 వేల ఎకరాలు కబ్జాపై శ్వేత పత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. లేకుంటే సిరిసిల్ల పర్యటనకు వస్తున్న రేవంత్ రెడ్డి తమ సవాల్‌ను స్వీకరించి, అంబేద్కర్ చౌరస్తా ముక్కు నెలకు రాసి, సిరిసిల్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశార చేశారు. ఈ మేరకు మంగళవారం సిరిసిల్ల తెలంగాణ భవన్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్, పార్టీ నేతలతో కలిసి తోట ఆగయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగయ్య మాట్లాడుతూ రాష్టంలో కాంగ్రెస్ పాలన రాక్షస పాలన సాగిస్తుందని పేర్కొన్నారు. అసెంబ్లీ లో సిరిసిల్ల లో 8 వేల ఎకరాలు కబ్జా చేశారని, సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని, 8 వేల ఎకరాలు తో పాటు రికవరీ చేశామన్న 2400 ఎకరాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వీటి వివరాలు గ్రామాల వారీగా పేర్లతో వివరాలు బయట పెట్టాలన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని, ఆ ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకుంటున్నామన్నారు. లేకుంటే సిరిసిల్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని, అంబేద్కర్ చౌరస్తాలో ముక్కు నెలకు రాయాలని డిమాండ్ చేశారు. మా సవాల్ స్వీకరించాలని హెచ్చరించారు. విప్ ఆది శ్రీనివాస్ ఆరోపణలను ఖండించారు. తాను మంత్రి అవుతానని, పగటి కలలు కంటున్నారని, కేసీఆర్, కేటీఆర్‌పై ఆరోపణలు చేయడం పై మండి పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కాలి గోటికి సరిపోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖబ్దార్ కేసీఆర్, కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల కు వచ్చి, 8 వేల ఎకరాలు వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ సిరిసిల్లలో 8 వేల ఎకరాలు కబ్జా చేశారని, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో మాట్లాడారని, దీనిపై ఆర్టీఐ చట్టం ప్రకారం దరఖాస్తు పెడుతున్నామని, ఆలస్యం చేయకుండా మీ దగ్గర సమాచారాన్ని అధికారులతో ఇప్పించాలని డిమాండ్ చేశారు.
కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.బఇప్పటికే వేసిన కమిషన్ లకు అతీగతీ లేదన్నారు. సిరిసిల్ల లో 8 వేల ఎకరాలు కబ్జా, 2400 ఎకరాలు రికవరీ చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ప్రజలను అయోమయం చేయడం, ఆధారాలు లేకుండా అబద్ధాలు మాట్లాడటం సీఎం స్థాయి దిగజారి మాట్లాడారని పేర్కొన్నారు. ఇప్పటికైనా 8 వేల ఎకరాలు వివరాలు బయట పెట్టాలని, లేకుంటే సిరిసిల్ల ప్రజలకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విసిరిన సవాల్ ను స్వీకరించి అంబేద్కర్ చౌరస్తా లో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాలకొండ రాఘవ రెడ్డి, కుంబాల మల్లారెడ్డి, బొల్లి రామ్మోహన్, గుండ్లపల్లి పూర్ణచందర్, చంద్రయ్య, రాజు, స్వాతి, కౌన్సిలర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.