ఎమ్మెల్యే సారూ పంటలు కాపాడండి
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్న మా ఊరికి నీళ్లిచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడండి’ అంటూ తాడిజెర్రికు చెందిన రామిడి సతీశ్ సోషల్ మీడియా వేదికగా వేడుకున్నాడు
- చెరువులను నింపి ఆదుకోండి
- చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ఓ యువకుడి వేడుకోలు
- గంగాధర మండలంలో సాగునీటి గోసపై వీడియో
- సోషల్ మీడియాలో వైరల్
గంగాధర, మార్చి 17: ‘చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్న మా ఊరికి నీళ్లిచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడండి’ అంటూ తాడిజెర్రికు చెందిన రామిడి సతీశ్ సోషల్ మీడియా వేదికగా వేడుకున్నాడు. గంగాధర మండలంలో ఎండిన చెరువులు, అడుగంటిన బావులు, ఎండుతున్న పంటలను వీడియో తీసి పోస్ట్ చేశాడు. అందులో బోర్లు వేయిస్తూ.. బావులు పూడిక తీయిస్తూ రైతుల బాధలను కండ్లకు కట్టాడు. ఎమ్మెల్యే సత్యమన్నా ఉప్పరమల్యాల, రంగరావుపల్లి, కాసారం గర్శకుర్తి, తాడిజెర్రి గ్రామాల్లోని చెరువుల్లో నీళ్లు లేక బోరుబావులు ఎండిపోయాయని, నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.
పంటలు ఎండి పోవడానికి ప్రధాన కారణం చెరువుల్లో నీళ్లు లేకపోవడమేనని వాపోయాడు. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి చెరువులకు నీళ్లు వస్తాయని ఇక్కడి రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నాడు. ఇక్కడి రైతులను దృష్టిలో పెట్టుకుని చెరువులు నింపి పంటలు కాపాడాలని విజ్ఞప్తి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సాగునీటి గోసను కండ్లగడుతున్నది. మార్చిలోనే ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి సాగునీరు అందించాలని రైతులు వేడుకుంటున్నారు. లేదంటే పొలాలు చేతికొచ్చే సమయంలో నష్టపోతాయని ఆవేదన చెందారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

