గాలివాన బీభత్సం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. పొద్దంతా ఎండ దంచికొట్టినా.. సాయంత్రం నాలుగు గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాలిదుమారానికి తోడు ఉరుములు, మెరుపులు, పిడుగులతో అకాల వర్షం భయపెట్టింది.
- పొద్దంతా దంచికొట్టిన ఎండ
- సాయంత్రం అకాల వాన
- పిడుగుపాటుకు లారీ డ్రైవర్ బలి
- రోడ్లపై విరిగిపడ్డ చెట్లు
- తెగిపడ్డ విద్యుత్ వైర్లు
- లేచిపోయిన ఇంటి పైకప్పులు
కరీంనగర్, మే 25 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. పొద్దంతా ఎండ దంచికొట్టినా.. సాయంత్రం నాలుగు గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాలిదుమారానికి తోడు ఉరుములు, మెరుపులు, పిడుగులతో అకాల వర్షం భయపెట్టింది. చాలాచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడగా, రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ తీగలు తెగడంతోపాటు పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు కూలిపోయాయి. దీంతో అక్కడక్కడా చీకట్లు అలుముకున్నాయి. ఇటు తీవ్రంగా వీచిన గాలికి చాలా చోట్ల ఇండ్ల పైకప్పులు, రేకులు లేచిపోయాయి.
మల్లాపూర్తోపాటు రత్నాపూర్, మేడిపల్లి మండలంలోని దమ్మన్నపేట, దేశాయిపేట, రాగోజిపేట, కథలాపూర్ మండలంలోని గంభీర్పూర్, తాండ్య్రాల, పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రం, నాంసానిపల్లి, లంబాడితండా, సిరిసిల్ల పట్టణంలోని గోపాల్‌నగర్, బీవైనగర్, కోనరావుపేట మండల కేంద్రంతో పాటు బావుసాయి పేట, కొండాపూర్, ధర్మారం, నిమ్మపల్లి, నిజామాబాద్, చందుర్తి మండలం, ముస్తాబాద్ మండల కేంద్రం, బందనకల్, గూడెం, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం, వెంకటాపూర్, హరిదాస్‌నగర్, పదిర, అక్కపల్లిలో భారీ గాలులతో వర్షం కురవగా భారీగా నష్టం వాటిల్లింది.
దేశాయిపేటలో తాటిచెట్టు నేలకూలి రెండు మేకలు మృతిచెందాయి. భీమారం మండలం రాగోజిపేటలో తాటిచెట్టుపై పిడుగుపడి మంటలు చెలరేగాయి. లంబాడితండా సమీపంలోని విద్యుత్ టవర్ లైన్ తెగిపోయి రాత్రి మంటలు చెలరేగాయి. ముస్తాబాద్ మండలం బందనకల్‌లో కరుణాకర్‌రెడ్డి, ముస్తాబాద్‌లో కృష్ణతోపాటు పలువురు చెట్లకింద కార్లు నిలపగా చెట్ల కొమ్మలు విరిగి ధ్వంసమయ్యాయి.
పిడుగుపాటుతో లారీ డ్రైవర్ మృతి
జగిత్యాల పట్టణానికి చెందిన లారీ డ్రైవర్ మహమ్మద్ ఖాదిర్ శనివారం సాయం త్రం మల్లాపూర్‌లోని ఓ ఎరువుల దుకాణం మందు బస్తాలను దించుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు పిడుగుపాటుకు గురై గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఏఎస్ఐ లచ్చయ్య పరిశీలించి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఖాదిర్ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

