Ramagiri | రామగిరి, డిసెంబర్ 29 : ఆల్ సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్రాంత సింగరేణి కార్మికుల ద్వితీయ ఆత్మీయ మహా సమ్మేళనం సోమవారం రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని సాయి రామ్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విశ్రాంత కార్మికులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి రిటైర్డ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) దత్తాత్రేయులు, సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ హరి పచారీ, అసిస్టెంట్ కమిషనర్ గోవర్ధన్ మాట్లాడారు. సింగరేణి సంస్థ అభివృద్ధిలో విశ్రాంత కార్మికుల పాత్ర అమోఘమని, వారి సేవలు సంస్థ చరిత్రలో చిరస్మరణీయమని వారు కొనియాడారు. విశ్రాంతి అనంతరం కూడా కార్మికుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలపై సంఘటితంగా పోరాటం కొనసాగించాలని సూచించారు. సంఘ నాయకులు గౌతం శంకరయ్య, సురభీ ప్రసాద్ మాట్లాడుతూ పెన్షన్, సీఎంపీఎఫ్, వైద్య సదుపాయాలు వంటి కీలక అంశాలపై ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ ఆత్మీయ సమావేశం ద్వారా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పరస్పర అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ–3 జీఎం సుధాకర్ రావు, ఏఎల్పీ జీఎం నాగేశ్వర్ రావు, అధికారులు బాబ్ రావు, రిటైర్డ్ సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ లక్ష్మీనారాయణ, సంఘ ప్రతినిధులు పూదరి నర్సయ్య, పట్నం సత్యనారాయణ, ఎగోలపు మల్లయ్య, చిలుకల జవహర్, తోట మొండయ్య, ఎండీ సలీం, కోలిపాక సత్యనారాయణ, నలువల దామోదర్, కే శ్రీనివాస్ రెడ్డి, పాముల శేషగిరి, కొండ సమ్మయ్య, ఆయిలయ్య, వసంత నాగేశ్వర్ రావు, ఒజిర్, రఫీ, రంగిశెట్టి వెంకన్న, రామిడి వెంకటేశ్వరు, నూనె రాజేశం, చిట్యాల యాకూబ్, గందం సత్యనారాయణ, పర్స బక్కయ్యతో పాటు అనేక మంది విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.