Bommena | మస్కట్‌లో బొమ్మెన వాసి మృతి
కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామానికి చెందిన లోలపు శ్రీనివాస్ (40) అనే వ్యక్తి మస్కట్ దేశంలో అనారోగ్యంతో మృతిచెందినట్లు గ్రామస్తులు ఆదివారం తెలిపారు.
Bommena | కథలాపూర్, ఫిబ్రవరి 22: కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామానికి చెందిన లోలపు శ్రీనివాస్ (40) అనే వ్యక్తి మస్కట్ దేశంలో అనారోగ్యంతో మృతిచెందినట్లు గ్రామస్తులు ఆదివారం తెలిపారు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాస్ స్థానికంగా దినసరి కూలీగా పనిచేశారు. అయినప్పటికి కుటుంబ పోషణ గడవడం కష్టంగా మారింది.
శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం మూడు నెలల క్రితం మస్కట్ దేశం వెళ్లగా అక్కడ అనారోగ్యంతో బాధపడుతుంటే తోటి మిత్రులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్సలు చేయించారు. చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితం మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు ఆదివారం సమాచారం అందింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహం స్వగ్రామానికి పంపించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

