Chigurumamidi | చిగురుమామిడి, డిసెంబర్13: ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే తెల్లటి గోడలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులు నినాదాలతో నిండిపోయేవి. క్రమంగా వాటి పద్ధతి తగ్గుముఖం పట్టింది. తర్వాత బ్యానర్లు తెల్లటి వస్త్రాలతో నీలిరంగులతో రాసిన బ్యానర్లకు వీధులలో కట్టేవారు. ఆ తర్వాత అభ్యర్థుల చిత్రాలు, గుర్తులతో స్టిక్కర్లు, కరపత్రాలు ఫ్లెక్సీలు వచ్చాయి.
ఇంటింటికి వెళ్లి తలుపులు గోడలపై స్టిక్కర్లు అతికించేవారు. ఆ పద్ధతి కొంతమేరకు ఇప్పటికీ కొనసాగుతున్న ప్రస్తుతం సాంకేతిక రంగం కొత్త పొంతలు తొక్కడంతో సోషల్ మీడియాకు ప్రాధాన్యత పెరిగింది. వాట్సాప్ తో పాటు ఇంస్టాగ్రామ్ వంటి వాటితో ప్రతీ సమాచారాన్ని క్షణాల్లో చాలామందికి ఒక క్లిక్ తో చేరవేస్తున్నారు. ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికల్లో సోషల్ మీడియాకు ట్రేడింగ్ నడుస్తుంది. అభ్యర్థులు ప్రచారస్త్రంగా మార్చుకుంటున్నారు.
గ్రామాల్లో వాట్సాప్ ల ద్వారా గ్రామస్థాయి గ్రూపులు ఫ్రెండ్స్ యూత్ క్లాస్మేట్స్ కృసంగాల గ్రూపులలో కుల సంఘాల గ్రూపులను ఏర్పాటు చేసుకుంటున్నారు బరిలో ఉండే అభ్యర్థులు కార్యకర్తలు బాధ్యతలను వార్డుల వారిగా అప్పగించారు ఒక్కో గ్రూపులో వెయ్యి మందికి పైగా ప్రచారాన్ని వాడుకుంటున్నారు ఉదయం నుండి రాత్రి వరకు సోషల్ మీడియాలో వాడుకుంటున్నారు.