veenavanka | వీణవంక, జనవరి 14 : హిమ్మత్‌నగర్ గ్రామ పంచాయతీకి పర్మనెంట్ పంచాయితీ కార్యదర్శిని నియమించాలని ఆ గ్రామ వార్డు సభ్యురాలు కర్నకంటి నవ్య-భాస్కర్‌రెడ్డి ప్రకటన ప్రభుత్వాన్ని కోరారు. వీణవంక మండలంలోని హిమ్మత్‌నగర్ గ్రామ పంచాయతీకి 6 నెలలుగా ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శే విధులు నిర్వహిస్తున్నారని, కిష్టంపేటతో పాటు హిమ్మత్‌నగర్ గ్రామానికి కూడా ఒకరే విధులు నిర్వహించడం వల్ల ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందక అభివృద్ధి కుంటుపడుతుందని వాపోయారు.
గ్రామ అభివృద్ధి జరగాలంటే, ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలన్నా గ్రామానికి పర్మనెంట్ పంచాయతీ కార్యదర్శిని నియమించాలని మండల, జిల్లా స్థాయి అధికారులకు వార్డు సభ్యురాలు కర్నకంటి నవ్య విజ్ఞప్తి చేశారు.