Former MLA Ravi Shankar | గంగాధర, ఏప్రిల్ 26: ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభ ను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. మండలంలోని బూరుగుపల్లి గ్రామ కూడలిలో స్థానిక డప్పు కళాకారులతో కలిసి ఆయన శనివారం డప్పు కొట్టారు. రజతోత్సవ సభ కు ప్రజలు తరలిరావాలని దండోరా వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభ మహాకుంభ మేళాను తలపించాలన్నారు.
చొప్పదండి నియోజకవర్గం లోని ఆరు మండలాల నుండి 10 వేల మందిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుపారు. ఈ నెల 27న ఉదయం గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ జండాలను ఎగురవేసి సభ కు తరలిరావాలని సూచించారు. ప్రతీ మండలకేంద్రం నుండి వాహనాలు ర్యాలీగా తరలిరావాలన్నారు. ఇప్పటికే అయా గ్రామాల్లో ఇంచార్జిలను నియమించి ప్రజలను సభ కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
గ్రామాల్లో నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి లక్ష్యం మేరకు జనాన్ని తరలించేలా ప్రణాళిక తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్ రావు, నాయకులు దూలం శంకర్ గౌడ్, గడ్డం స్వామి తదితరులు పాల్గొన్నారు.