MLA SANJAY | మల్లాపూర్ ఏప్రిల్ 18: ఈనెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించతలపెట్టిన బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు. మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులతో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సభకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందించారని గుర్తు చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ సభకు తరలివచ్చి కేసీఆర్ ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గంగారెడ్డి, నాయకులు కాటిపల్లి ఆదిరెడ్డి, దేవ మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.