Noolupog Rath Yatra | కోల్ సిటీ, ఆగస్టు 1: ఈనెల 9న గోదావరిఖనిలో పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన యజ్ఞోపవీతం, నూలుపోగు రథయాత్ర కు పద్మశాలీలు ఇంటికొకరు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాజమల్లు, బూర్ల దామోదర్ కోరారు. సంఘం ప్రతినిధులతో మార్కండేయ కాలనీలో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు.
వారు మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని మార్కండేయ కాలనీ శివాలయం నుంచి నూలుపోగు రథయాత్ర బయలుదేరి చౌరస్తా మీదుగా లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్, చౌరస్తా మీదుగా గంగానగర్, పవర్ హౌస్ కాలనీ, బస్టాండ్, మున్సిపల్ ఆఫీసు నుంచి శివాలయం వరకు సాగుతుందనీ, ఈ రథయాత్రలో మగ్గంపై నేచిన వస్త్రంను అనంతరం మార్కండేయ స్వామికి సమర్పించడం జరుగుతుందన్నారు.
సమావేశంలో నాయకులు సిరిమల్ల జయరాములు, పోపా అధ్యక్ష, కార్యదర్శులు వడ్డెపల్లి దినేశ్, ఆర్ఎస్ మూర్తి, మహిళా గౌరవ అధ్యక్షురాలు లలిత శ్రీ మాటేటి సతీశ్, బొద్దుల వేణు, శ్రీనివాస్, కానుగంటి నారాయణ, ముడతనపల్లి సారయ్య, పోరండ్ల శారద, శాంతి, లక్ష్మీపతి, సత్యం, కొమురయ్య, నాగేశ్వర్, సత్యనారాయణ, బండి రాజన్న, తాటికొండ రాజమౌళి, నంబయ్య, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.