T Jeevan Reddy | భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిన బాధిత కుటుంబానికి ఇళ్లు మంజూరు చేయాలి.. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి
భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సారంగాపూర్ మండలంలోని పెంబట్ల, కోనాపూర్ గ్రామాల్లో ఆయన గురువారం పర్యటించి లోతట్టు ప్రాంతాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
- భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
T Jeevan Reddy | సారంగాపూర్, జూలై 30 : భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సారంగాపూర్ మండలంలోని పెంబట్ల, కోనాపూర్ గ్రామాల్లో ఆయన గురువారం పర్యటించి లోతట్టు ప్రాంతాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పెంబట్ల గ్రామానికి చెందిన పస్తం స్వప్న, వారి సోదరులు పరమేష్, దుర్గెష్ల ఇల్లు భారీ వర్షానికి కూలిపోవడంతో పరిశీలించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఆర్డీవో మధుసుధన్, తహసీల్దార్ వహిదొద్దిన్లతో ఫోన్లో మాట్లాడుతూ వర్షాలకు పలువురి ఇండ్లు పూర్తిగా కూలిపోయాయని, నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లించి నూతన ఇల్లు మంజూరు చేయాలని అన్నారు. అధికారులు క్షత్రస్థాయిలో పరిశీలించి బాధిత కుటుంబాన్ని అదుకోవాలన్నారు. ప్రభుత్వం నుండి ఆర్థిక సహయం అందించేలా తనవంతు కృషి చేస్తానని, నూతన ఇల్లు మంజూరయ్యేలా చూస్తానని, బాధిత కుటుంబాలకి జీవన్ రెడ్డి భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి జీవన్ రెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కోనాపూర్ సర్పంచ్ ఆకుల రమేష్, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు తేలు రాజు, నాయకులు వాసం శ్రీనివాస్, అలీమ్, జనార్ధన్, వెంకటేష్, వేణు, మల్లయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- Heavy Rain
- Jagityal
- Sanctioned
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

