 
                                                            Pegadapally | పెగడపల్లి: పెగడపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా రెండేళ్ల పాటు విధులు నిర్వహించి, కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలానికి బదిలీ అయిన శ్రీనివాస్‌రెడ్డికి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆత్మీయ సన్మానం నిర్వహించారు. మండల పరిషత్ అధికారులు, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి మండలానికి చేసిన సేవలను కొనియాడారు.
పూల మాలలు, శాలువాలతో ఘన సన్మానం చేశారు. అలాగే నూతనంగా మండలానికి వచ్చిన ఎంపీడీవో ప్రేమాసాగర్, ఎంపీవో శశికుమార్డ్డిలకు స్వాగతం పలుకుతూ వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములుగౌడ్, తహసీల్దార్ ఆనందకుమార్, కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 
                            