Rasamayi Balakishan | తిమ్మాపూర్, జూన్ 28 : తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో శివారులో మోయ తుమ్మెద వాగులో ఇసుక తవ్వకలను పార్టీ నాయకులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గుంపు మేస్త్రి తయారై రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాడని, మానకొండూరు నియోజకవర్గంలో ముఠామేస్త్రి నియోజకవర్గాన్ని ఆగం చేశారని దుయ్యబట్టారు. వాగుల్లో ఇసుక లేదని, ఎటు చూసినా మట్టిదిబ్బలే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటు చూసినా నీళ్లే కనిపించేవని, ఇప్పుడు వాగులను చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మూడేళ్లలోనే కాలేశ్వరం పూర్తి చేసుకొని మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగ నాయకసాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్లు నిర్మించామని గుర్తు చేశారు. తాము రిజర్వాయర్లను నిర్మిస్తే, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇసుక దోపిడీ చేస్తున్నదని అన్నారు. 30 నెలల్లో ఎక్కడ చేసిన బొందల గడ్డలను చేశారని దుయ్యబట్టారు.
కొత్తపల్లిలో నడుస్తున్న వారిని గతంలో ముంబై సంస్థ తీసుకున్నదని, కేవలం పూడికతీయుట కోసమే ప్రభుత్వం నుండి కాంట్రాక్ట్ తీసుకున్నారని వాళ్లు మట్టి మాత్రమే తీశారని, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి నడిపించాడనీ, వాళ్లను కమిషన్ ఇవ్వాలని బెదిరించి వాళ్ల నుండి మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అనుచరుడు స్వాధీనం చేసుకున్నారన్నారు. మానకొండూర్ ప్రజలు ఇక్కడ మట్టి కనపడితే అక్కడ మట్టిని, ఇసుక కనబడితే ఇసుక నమ్ముకోవడానికి ఎమ్మెల్యే ఏం చేయలేదని.. ఇసుక తీసి రైతుల ఉసురు తీయద్దని సూచించారు. రైతుల వారి నార్లు పోసుకొని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు అన్నారు. అవసరమైతే వర్షాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఎత్తుకోమని ప్రస్తుతం ఇసుక అక్రమ రవాణా తవ్వకాలను నిలిపియాలని సూచించారు. కొత్తపల్లి వాగులో క్వారీ నడిచినప్పుడు కనీసం ఇక్కడి కూలీలకు పని కూడా ఇవ్వలేదు. ఇంత అక్రమ తవ్వకాలు జరుగుతున్నా.. అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడడం లేదని, అధికారులకు ఎన్ని ముడుపులు మూడుతున్నాయని ప్రశ్నించారు. ఒక్క ట్రాక్టర్ తో ఇసుక నడిపితే కేసులు పెట్టె అధికారులు ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
వాగుల నుండి దొంగ ఇసుక రవాణా జరుగుతున్నది. రాత్రిళ్ళు అక్రమ ఇసుక రవాణాకు సామాన్యులు బలి అవుతున్నారు. అక్రమ ఇసుక దందాలో కుటుంబ సభ్యులను కూడా వదల్లేదని, దగ్గరి బంధువు దగ్గర రూ.30లక్షలు వసూలు చేశారని అన్నారు. వాగుల వెంట ఎక్కడ చూసినా మట్టి కుప్పలు కనిపిస్తున్నాయని అన్నారు. నీ అక్రమ దందాకు రోడ్లు కూడా పాడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామకృష్ణారావు, మాజీ మండల అధ్యక్షుడు రావుల రమేష్, కార్పొరేటర్ కాల్వ మల్లేశం, నాయకులు సిద్ధం వేణు, శేఖర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, స్వామి రెడ్డి, పాశం అశోక్ రెడ్డి, పొన్నం అనిల్, తిరుపతి, సది, రమేష్, తదితరులు పాల్గొన్నారు.