తిమ్మాపూర్, మార్చి4: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ గ్రామంలో గల శ్రీ సీతారామ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన చైత్ర ఆక్వా టెక్నాలజీ నిర్వాహకుడు గొరిటాల సతీష్ రూ.లక్ష యాభై వేల విలువచేసే వాటర్ ప్లాంట్ను తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేశాడు. దీనిని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన సతీష్ ను ఎమ్మెల్యే అభినందించారు.
అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొద్ది రోజుల్లో జరగనున్న ఆలయ బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. రథోత్సవం, శకటోత్సవం రోజుల్లో ఎలాంటి అపశృతి జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ కమిటీ బాధ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బండారు లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, కొత్త తిరుపతిరెడ్డి, గండ్ర శ్రీనివాస్, దేవస్థానం డైరెక్టర్లు గాజుల అంజయ్య,బూత్కూరి శ్రీనివాస్, కందుకూరి లక్ష్మిరాజం, జినుక శ్రీనివాస్, మార్క మొండయ్య, రొడ్డ సాగర్, పూజారి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.