Lions Club | రామగిరి, జనవరి 16 : లయన్స్ ఇంటర్నేషనల్ రీజియన్–8 ఆధ్వర్యంలో సుల్తానాబాద్ లోని బొంతకుంటపల్లి ఫోటో ఫామ్–విజయ ఏసీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన రీజియన్ మీట్లో లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ 11 కేటగిరీలలో అవార్డులు సాధించి ఘన విజయం సాధించింది. 114 సేవా కార్యక్రమాల ద్వారా సుమారు 7,000 మందికి సేవలందించిన క్లబ్, రీజియన్‌లోని 7 క్లబ్బులలో రెండవ ఉత్తమ క్లబ్‌గా నిలిచి 2వ బెస్ట్ క్లబ్ ఆఫ్ ది రీజియన్ అవార్డును గెలుచుకుంది.
ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు లయన్ మేకల మారుతి యాదవ్‌కు ఉత్తమ అధ్యక్షుడు, కార్యదర్శి లయన్ అబ్బు కేశవ రెడ్డికి ఉత్తమ కార్యదర్శి అవార్డులు లభించాయి. అవార్డులను ముఖ్య అతిథి మోటివేషనల్ స్పీకర్ సండ్ర సుధీర్, రీజినల్ చైర్మన్ రేకులపల్లి శశాంక, జోనల్ చైర్మన్ సాదుల వెంకటేశ్వర్లు అందజేశారు.
అనంతరం అధ్యక్షుడు మేకల మారుతి యాదవ్ మాట్లాడుతూ క్లబ్ సభ్యులు, దాతల సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అబ్బు కేశవ రెడ్డి, డైరెక్టర్ గంట వెంకటరమణ రెడ్డి, గుండ శ్రీనివాస్, మేకల గణేష్, బేరి కుమార్, జంగ తిరుపతి తదితర సభ్యులు పాల్గొన్నారు.