Peddapally | పెద్దపల్లి కమాన్, అక్టోబర్ 25 : విద్యార్థులు లక్ష్యం పెట్టుకుని, ప్రణాళికతో చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల సూచించారు. పెద్దపల్లి గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాలలో శనివారం నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సు జడ్జి ముఖ్య అతిదిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చెడు వ్యసనలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించి, తల్లిదండ్రుల కలలను సాకారం చేయలన్నారు.
యువత తొందరపడి ప్రేమ వివాహలు చేసుకొకుండా, చదువులో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. ఇక్కడ జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి కె. స్వప్న రాణి, గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్, కరెస్పాండెంట్ రజనీదేవి, న్యాయవాదులు నుచ్చు శ్రీనివాస్, నరేష్, జాన్సీ, శరత్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.