Kalvasrirampur | కాల్వ శ్రీరాంపూర్, సెప్టెంబర్ 20 : మల్యాల-పోచంపల్లి నక్కల ఒర్రెపై వంతెన నిర్మించాలని కాల్వశ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ డిమాండ్ చేశారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మల్యాల-పోచంపల్లి గ్రామాల మధ్యనున్న నక్కల ఒర్రెపై వంతెన నిర్మించాలని కోరుతూ గ్రామస్తులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు గండిపడ్డ నక్కల ఒర్రెను పరిశీలించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మల్యాల గ్రామ రైతుల వ్యవసాయ భూములు ఇటువైపే ఉన్నాయని, వర్షాల సమయంలో ఒర్రె దాటాలంటే రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాటాల్సి వస్తోందని అన్నారు. ప్రజా ప్రతినిధులకు ఎన్నో సార్లు చెప్పినా నామమాత్రపు పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు.
గతంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పోచంపల్లి నుండి ఓదెల మల్లిఖార్జున దేవస్థానం వరకు రూ.10కోట్లతో నిధులతో రోడ్డు మంజూరు చేయించారని అన్నారు. ఆ రోడ్డు పనులు త్వరతి గతిన పూర్తి చేసి, నక్కల ఒర్రెపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిదానపురం దేవయ్య, కర్ణాకర్‌రావు, వేల్పుల సంపత్, కామిడి వెంకట్‌రెడ్డి, జక్కె విష్ణు, ఎరబాటి రవి, లెక్కల వేణుగోపాల్‌రెడ్డి, కల్లెపెల్లి సాగర్, రాపర్తి సుజాత, ధర్ముల రవి తదితరులు పాల్గొన్నారు.