Dharamaram | కటికనపల్లిలో బాలుడి నేత్రదానం.. మరో ఇద్దరికి చూపు
ధర్మారం మండలం కటికనపల్లి గ్రామానికి చెందిన బొజ్జ సంపత్ కుమారుడు అభిరామ్ (6) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. విద్యాసాగర్ అనే వ్యక్తి బాలుడి నేత్రదానం పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
Dharamaram | ధర్మారం, మార్చి 24 : ధర్మారం మండలం కటికనపల్లి గ్రామానికి చెందిన బొజ్జ సంపత్ కుమారుడు అభిరామ్ (6) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. విద్యాసాగర్ అనే వ్యక్తి బాలుడి నేత్రదానం పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. తమ కుమారుడు మరణించినప్పటికీ ఇద్దరి అంధులకు చూపు వస్తుందని గొప్ప ఆలోచనతో వారు తమ కుమారుడి నేత్రాలు దానం చేయడానికి అంగీకరించారు. దీంతో సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి ఆధ్వర్యంలో ఎల్వీపీ గాజుల సతీష్ సహకారంతో కార్నియాలు సేకరించి, హైద్రాబాద్ ఐ బ్యాంక్ పంపించారు.
ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన తల్లితండ్రులు బొజ్జ సంపత్, స్వప్నకు సహకరించిన కుటుంబ సభ్యులకు, అవగాహన కల్పించిన మిత్రులు విద్యాసాగర్కు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి, గౌరవ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారులు రమేష్, ప్రచార కార్యదర్శి వాసు, పాలకుర్తి మండల అధ్యక్షుడు పృథ్విరాజ్ క్యాతం మల్లేశం, మేర్గు సారంగం ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

