Coal production | గోదావరిఖని : సింగరేణి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్ లో Rg-1 డివిజన్లో కేవలం 51శాతం బొగ్గు ఉత్పత్తి జరిగిందని జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ తెలిపారు. జీఎం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ లో 406400 ట న్నుల లక్ష్యానికి గాను 206439 టన్నుల బొగ్గు ఉత్పత్తి 51శాతం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.
ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 5 నుంచి 3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి గాను 147064 టన్నులు (49శాతం) వచ్చిందని ఓసీపీలో షావల్స్ సమస్యతో పాటు బొగ్గుపై కప్పబడి ఉండే ఓవర్ బర్డెన్ మట్టి వెలికితీత పనులు నెమ్మదించడం వల్ల బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడిందని ఆయన వివరించారు.
రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తి పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు మంచినీటి సరఫరా ఇబ్బందులు ఏర్పడకుండా గోదావరి నది వద్ద చర్యలు చేపట్టినట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అధికారులు గోపాల్ సింగ్, డీవీ రావు, డాక్టర్ అంబిక, కిరణ్ బాబు, వరప్రసాద్, జితేందర్ సింగ్, రవీందర్ రెడ్డి సీనియర్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
సింగరేణిలో మొదటి నెలలో 98 శాతం బొగ్గు ఉత్పత్తి
219 శాతం బొగ్గు ఉత్పత్తితో రికార్డు సృష్టించిన ఆర్జీ2
సింగరేణి సంస్థ 2025 26 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్ లో 98శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది. 72 మిలియన్ టన్నుల భారీ ఉత్పత్తి లక్ష్యసాధన తో ముందుకు సాగుతున్న సింగరేణి సంస్థ ఏప్రిల్ నెలలో 5278300 టన్నుల లక్ష్యాన్ని గాను 5172127 టన్నులు 98 శాతం సాధించింది. రామగుండం డివిజన్ 2 ఏప్రిల్ నెల లో 228400 టన్నులకు గాను 499986 (219శాతం) సాధించి రికార్డు సృష్టించింది.
మణుగూరు డివిజన్ 117శాతం, కొత్తగూడెం 93శాతం, శ్రీరాంపూర్ 92శాతం, రామగుండం డివిజన్ 3 89శాతం, అడ్రియాల ప్రాజెక్ట్ 84శాతం ఇల్లందు 82శాతం, బెల్లంపల్లి 78శాతం, మందమరి భూపాలపల్లి 70శాతం, రామగుండం డివిజన్ వన్ 51శాతం సాధించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా తగ్గడం వల్ల ఏప్రిల్ నెలలో నిర్దేశిత లక్ష్యాన్ని సాధించలేకపోయినట్లు అధికారులు పేర్కొంటున్నారు.