Vemulawada | వేములవాడ, మే 14: వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు స్వాగతం పలికే నంది కమాన్ 50 వసంతాలు పూర్తి చేసుకున్నది. 1971కి ముందు రాజన్న ఆలయానికి చేరుకోవాలంటే భక్తులకు రవాణా సౌకర్యం ఉండేది కాదు. అప్పుడు కరీంనగర్ నుంచి సిరిసిల్లకు మాత్రమే వాహనాలు నడిచేవి. రాజన్నను చేరుకోవాలనే భక్తులు, వేములవాడ పట్టణవాసులు కూడా నాంపల్లి వద్ద వాహనాలు దిగి నడుచుకుంటూ వెళ్లేవారు అయితే రాజన్న భక్తుల సౌకర్యార్థం వాహనాలను నడిపించాలని అప్పటి రాజన్న ఆలయ చైర్మన్ వెంకటేశ్వర్ రావు నంది కమాన్ వద్ద స్వాగత తోరణం కమాన్ నిర్మించడమే కాకుండా తిప్పాపూర్ వరకు రాజన్న ఆలయ నిధులు దాదాపు 1.50 లక్షలతో నాలుగు కిలోమీటర్ల రహదారిని కూడా నిర్మించారు. అప్పటి నుంచే వేములవాడకు వాహనాల రాకపోకలు ప్రారంభమైనట్లు స్థానికులు తెలిపారు.
Karimnagar9
పలుచోట్ల స్వాగత తోరణాలు
రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు స్వాగతం పలికేందుకు రాజన్న ఆలయ అధికారులు పలుచోట్ల స్వాగత తోరణాలు నిర్మించారు. ఇందులో పురపాలక సంఘం పరిధిలోని నాంపల్లి, కోరుట్ల బస్టాండ్, జగిత్యాల బస్టాండ్, కోరుట్ల పట్టణం, సిద్దిపేట పట్టణాల్లో కూడా వేములవాడకు వెళ్లే రహదారులలో స్వాగత తోరణాలు నిర్మించి భక్తులకు స్వాగతం పలుకుతున్నారు.
50 వసంతాల కట్టడం..చెకుచెదరని స్వాగత తోరణం
వేములవాడ రాజన్న భక్తులతో పాటు, పట్టణ వాసుల సౌకర్యార్థం అప్పటి రాజన్న ఆలయ చైర్మన్ వెంకటేశ్వర్ రావు అధికారులు నంది కమాన్ వద్ద స్వాగత తోరణం కమాన్ నిర్మించారు. 1971 ఫిబ్రవరిలో ప్రారంభించిన పనులు 1973 మార్చి నాటికి పూర్తయ్యాయి. అప్పటి నిర్మాణ పనుల్లో అనుభవం ఉన్న చెదరవెల్లి రామస్వామి ఈ కట్టడాన్ని అకడే డంగు సున్నం తయారు చేయించి పూర్తి చేశారు. డంగు సున్నంతో నిర్మించిన నంది కమాన్ పున్నమి వెలుగుల్లో కాంతివంతంగా ప్రకాశించేది. ప్రతి మహా శివరాత్రికి పెయింటింగ్ వేయడంతో కాస్త వన్నె తగ్గింది. 50 వసంతాలు నిండినా ఇప్పటికీ నిర్మాణం మాత్రం చెకుచెదరకుండా రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతూనే ఉంది.
Karimnagar10