Gangadhara | గంగాధర, జనవరి 18: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్ల నర్సింహులపల్లి లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వీరభద్ర స్వామి 35వ వార్షికోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వీరభద్ర స్వామి కళ్యాణం, అగ్నిగుండాలు, అభిషేకాలు, అర్చనలను వైభవంగా నిర్వహించారు.
వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందజేశారు. నిర్వాహకులు ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు రాచమల్ల రవి, కరబూజ తిరుపతి గౌడ్, ముద్దం నగేష్, మాజీ సర్పంచ్ తోట మల్లారెడ్డి, నాయకులు రాచమల్ల భాస్కర్, బైరిశెట్టి సంపత్ తదితరులు పాల్గొన్నారు.