Godavarikhani | కోల్ సిటీ, మే 4: గోదావరిఖని నగరంలోని ప్రధాన శ్రీ కోదండ రామాలయంలో లోక కళ్యాణార్థం 24 గంటల సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ముందుగా ఆలయంలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు, గురుస్వాములు, హనుమాన్ మాలదారులు 24 గంటల చాలీసా పారాయణంప్రారంభించారు.
సమాజంలో ప్రతికూల శక్తులు నశించి పోయి ప్రతి ఒక్కరి వ్యక్తిగత కష్టాలు తొలగిపోవాలని వేడుకుంటూ ఆంజనేయ స్వామిని స్మరిస్తూ పారాయణం చేస్తున్నారు. రేపటి వరకు నిర్విఘ్నంగా అత్యంత నియమ నిష్ఠలతో భక్తి ప్రపత్తు ల తో కొనసాగే పారాయణంలో పారిశ్రామిక ప్రాంతంలోని హనుమాన్ భక్తులు మాలధారులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. ఆలయ ఈవో సూచనల మేరకు సీనియర్ అసిస్టెంట్ సుధాకర్, అశోక్ లు భక్తులకు ఇబ్బందులు కలగకుండావసతులు కల్పించారు.