e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home కరీంనగర్ అణగారిన వర్గాల అభ్యున్నతికే దళితబంధు

అణగారిన వర్గాల అభ్యున్నతికే దళితబంధు

మంత్రి కొప్పుల ఈశ్వర్‌
పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లో పర్యటన

పెగడపల్లి/గొల్లపల్లి ఆగస్టు 5: అణగారిన వర్గాల అభ్యున్నతికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితబంధు పథకానికి అంకురార్పణ చేశారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఉద్ఘాటించారు. నిరుపేదలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకే ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు అందిస్తున్నారని చెప్పారు. దళితుల అభివృద్ధిని ఓర్వలేకే కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ బాధ్యాతరహితంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఒక్కో కుటుంబానికి రూ. 50లక్షలు ఇవ్వాలని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే రూ. 40లక్షలైనా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గురువారం పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లో మంత్రి పర్యటించారు. పెగడపల్లి జడ్పీ స్కూల్‌లో రూ. 72లక్షలతో నిర్మించే అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 49 మందికి రూ. 17లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. గొల్లపల్లి మండలం తిర్మలాపూర్‌(పీడీ)లో షాదీఖానాను ప్రారంభించారు. పలువురి మహిళలకు కుట్టుమిషన్లు అందించారు. గ్రామంలోని అంగన్‌వాడీ సెంటర్‌లో తల్లులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ దళిత ఎంపవర్‌మెంట్‌ స్కీంకు గత బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే స్కీంకు దళితబంధుగా నామకరణం చేశారని చెప్పారు.

ఈ నెల 16న హుజూరాబాద్‌లో ప్రారంభించి మొదటి విడుతలో రెండు వేల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున అందజేస్తారని పేర్కొన్నారు. దళితులు బాగుపడితే పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష పార్టీల నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ గోళి శోభ, జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్‌రావు, వైస్‌ ఎంపీపీ గాజుల గంగాధర్‌, విండో చైర్మన్లు కర్ర భాస్కర్‌రెడ్డి, మంత్రి వేణుగోపాల్‌, మార్కెట్‌ చైర్మన్‌ నగావత్‌ తిరుపతినాయక్‌, ఆర్బీస్‌ అధ్యక్షుడు ఉప్పుగండ్ల నరేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ రాజమనోహర్‌రెడ్డి, ఎంపీడీవో వెంకటేశం, డీటీ శ్రీనివాస్‌, ఏఈ ఆదిత్య, సర్పంచులు మేర్గు శ్రీనివాస్‌, కరుణాకర్‌రెడ్డి, లక్ష్మణ్‌, రాకేశ్‌, ఎంపీటీసీలు బొమ్మెన జమున, రవీందర్‌, నేతలు మల్లారెడ్డి, సురేందర్‌రెడ్డి, వెంకన్న, పుల్లూరి సత్యనారాయణ, కరుణాకర్‌రావు, టీ.రాజు, ఇరుగురాల ఆనందం, మోహన్‌రెడ్డి, బొమ్మెన స్వామి, పెద్ది రమేశ్‌, ప్రవీణ్‌రావు, నర్సింహారెడ్డి, మల్లారెడ్డి, భాస్కర్‌రెడ్డి, లోకేష్‌, తిరుపతి, శంకర్‌, లక్ష్మీనారాయణ, వీరేశం, కాంతయ్య, చిరంజీవి, గంగారెడ్డి, గొల్లపల్లిలో జడ్పీటీసీ జలంధర్‌, సర్పంచ్‌ రమేశ్‌, ఏఎంసీ చైర్మన్‌ లింగారెడ్డి, వైస్‌ చైర్మన్‌ గంగాధర్‌, వైస్‌ ఎంపీపీ సత్తయ్య, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి, మండల కోఆప్షన్‌ సభ్యుడు మహ్మద్‌ అలీ, టీఆర్‌ఎస్‌ నాయకులు రవీందర్‌ రెడ్డి, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana