జమ్మికుంట రూరల్, నవంబర్ 25: సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఓట్ల కోసం కాదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు శుక్రవారం జమ్మికుంట మండలంలోని శాయంపేటలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు సర్పంచ్ సుజాతా భద్రయ్య, ఎంపీపీ దొడ్డి మమత, జడ్పీటీసీ డాక్టర్ శ్రీరాం శ్యాం ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి సన్మానించారు. అనంతరం పలువురు సమస్యలను ఏకరువు పెట్టారు. కల్యాణలక్ష్మి రావడంలేదని చెప్పిన రాచపల్లికి చెందిన స్వరూపకు వెంటనే చెక్కు అందజేశారు.
అలాగే రోడ్డు ని ర్మించాలని, దళితబంధు, పింఛన్లు మంజూరు చేయాలని, స్తంభాలు వేయించాలని, బిజిగిరిషరీఫ్‌కు వెళ్లే బైపాస్ రోడ్డును నిర్మించాలని గ్రా మస్తులు ఎమ్మెల్సీకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని ప్రతి పల్లె గొప్పగా అభివృద్ధి చెందిందని చెప్పారు. సీఎం కేసీఆర్ శాయంపేటకు 213 పింఛన్లను మంజూరు చేసి, ప్రతి నె లా రూ. 52 లక్షలు పంపిస్తున్నారన్నారు.
దళితబంధు కింద 185 యూనిట్లను మం జూ రు చేసి, లబ్ధిదారులకు అందించామన్నారు. గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. త్వరలోనే ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎంపీటీసీ సంపెల్లి స్వరూపాభీమంరా వు, ఆర్డీవో హరిసింగ్, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీవో సతీశ్‌కుమార్, ఉప సర్పంచ్ రవీందర్రావు మాజీ సర్పంచ్ సురేందర్‌రావు ఉన్నారు.