e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home కామారెడ్డి నీటి వనరులు పెంచేందుకు ప్రభుత్వం కృషి

నీటి వనరులు పెంచేందుకు ప్రభుత్వం కృషి

నీటి వనరులు పెంచేందుకు ప్రభుత్వం కృషి

వేల్పూర్‌, ఏప్రిల్‌ 3: రాష్ట్రంలో సాగునీటి వనరులను పెంచడానికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వేల్పూర్‌లో పెద్దవాగుపై నూతనంగా రూ.9కోట్ల 35లక్షతో నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌ పనులకు, నూతనంగా నిర్మిస్తున్న మహిళా, ముదిరాజ్‌ సంఘం భవనాలను మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నీటి వనరులను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నదని అన్నారు. వాగులపై చెక్‌డ్యామ్‌లు నిర్మించడంతో ఈ ప్రాం తంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. వేల్పూర్‌ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు. అంతకు ముందు పెద్దమ్మ ఆలయం లో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ముదిరాజ్‌ సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు.


షటిల్‌ కోర్టును ప్రారంభించిన మంత్రి
మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో నూతనంగా ఏర్పా టు చేసిన షటిల్‌ కోర్టును మంత్రి ప్రారంభించారు. షటిల్‌ కోర్టు ఏర్పాటు చేయించిన ఎస్సై రాజ్‌భరత్‌ను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రమేశ్‌రె డ్డి, ఆర్టీఏ సభ్యుగు రేగుల్ల రాములు, ఎంపీపీ భీమ జమున, జడ్పీటీసీ భారతి,వైస్‌ ఎంపీపీ రమేశ్‌, ఎంపీటీసీ మహేశ్‌, సర్పంచ్‌ తీగల రాధ, ఉపసర్పంచ్‌ సత్యం, గ్రామ కమిటీ అధ్యక్షుడు నరేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు నాగధర్‌, మహిపాల్‌, ప్రతాప్‌, మోహన్‌, నర్సారెడ్డి పాల్గొన్నారు.


అభివృద్ధి పనుల ప్రారంభం..
మోర్తాడ్‌(కమ్మర్‌పల్లి), ఏప్రిల్‌ 3: కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌, కమ్మర్‌పల్లి, హాసాకొత్తూర్‌లో పలు అభివృద్ధి కార్య క్రమాలను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌లో పల్లె ప్రకృతివనం, వైకుంఠ ధామం, రైతువేదిక, షాదీఖానా, సీసీ రోడ్లు, మిషన్‌ భగీరథ నల్లాలను ప్రారంభించారు. కమ్మర్‌పల్లిలో పల్లె పకృతివనం, సీసీ రోడ్లు, ఆర్‌ఎన్‌ఎం ట్రేడర్స్‌ను, హాసాకొత్తూర్‌లో సీసీ రోడ్లకు మంత్రి ప్రారంభోత్సవాలు చేశారు. సర్పంచులు పద్మ చిన్నారెడ్డి, ఏనుగు పద్మ రాజేశ్వర్‌, స్వామి, ఎంపీటీసీ లు అనిల్‌, రజిత, సుధాకర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు దేవేందర్‌, ఏలియా, కో-ఆప్షన్‌ సభ్యుడు పాషా, శ్రీకుమా ర్‌, గణేశ్‌, హరీశ్‌, రాజేశ్వర్‌, రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

నేడు మంత్రి వేముల పర్యటన
వేల్పూర్‌, ఏప్రిల్‌ 3: బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదివారం పర్యటించనున్నారు. వేల్పూర్‌, భీమ్‌గల్‌, కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌, బాల్కొండ మండలాల్లోని ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణ పనులను మంత్రి పరిశీలిస్తారు. మెండోరా మండలంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి స్థల పరిశీలన చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఎస్సారెస్పీ పునర్జీవ పథకం(కాళేశ్వరం రివర్స్‌ పంపింగ్‌)లో భాగంగా వరద కాలువ జీరో పాయింట్‌ వద్ద నిర్మాణంలో ఉన్న పంపు హౌస్‌ పనులను మంత్రి పరిశీలిస్తారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నీటి వనరులు పెంచేందుకు ప్రభుత్వం కృషి

ట్రెండింగ్‌

Advertisement