మంగళవారం 02 మార్చి 2021
Kamareddy - Jan 17, 2021 , 00:10:26

మిషన్‌ భగీరథ పనులు నెలాఖరులోగా పూర్తిచేయాలి

మిషన్‌ భగీరథ పనులు నెలాఖరులోగా పూర్తిచేయాలి

అధికారులతో సమీక్షలో కలెక్టర్‌ శరత్‌ 

కామారెడ్డి టౌన్‌/ విద్యానగర్‌, జనవరి 16: మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ నిర్మాణ పనులను ఈనెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మిషన్‌ భగీరథ పథకం పనులపై సంబంధిత అధికారులతో శనివారం సమీక్షను నిర్వహించారు. పనులు పెండింగ్‌ లేకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో మిషన్‌ భగీరథ ఎస్‌ఈ లక్ష్మీనారాయణ, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. 

వండర్‌కిడ్‌కు కలెక్టర్‌ అభినందన 

ఈనెల 9వ నిర్వహించిన క్యూబ్స్‌, బైనరీ నంబర్స్‌ పరీక్షల్లో ప్రతిభ చూపి లిమ్కా బుక్‌, వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకున్న విద్యార్థిని పేరం మధుమితను కలెక్టర్‌ శరత్‌ తన చాంబర్‌లో అభినందించారు. భిక్కనూరు మండలం జంగంపల్లిలో ఓ సామా న్య కుటుంబంలో జన్మించిన మధుమిత జిల్లా పేరును ప్రపంచానికి చాటిందని ప్రశంసించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో మధుమిత తండ్రి స్వామి, రజనీకాంత్‌ ఉన్నారు. 

VIDEOS

logo