మంగళవారం 24 నవంబర్ 2020
Kamareddy - Oct 24, 2020 , 01:11:47

బతుకమ్మ పాట ఆవిష్కరణ

బతుకమ్మ పాట ఆవిష్కరణ

విద్యానగర్‌ : జిల్లాకేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన చక్రధర్‌ గౌడ్‌, నితిన్‌ గౌడ్‌, శ్రీనివాస్‌, రవీందర్‌ గౌడ్‌ బతుకమ్మ వీడియో సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ పాటకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి స్పాన్సర్‌గా వ్యవహించారు. విద్యానగర్‌ కాలనీలో బతుకమ్మ పాటను ఆమె శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులపై బతుకమ్మ ఎలా స్పందిస్తుందో పాటలో వివరించారని  ఆమె తెలిపారు. జిల్లాలో శనివారం నిర్వహించే బతుకమ్మ వేడుకలను కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో శివసాయి పార్క్‌ ప్రెసిడెంట్‌ శివారెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.