మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Kamareddy - Sep 16, 2020 , 03:10:53

జిల్లాలో మూడు లక్షల జీవాలకు పీపీఆర్‌ టీకాలు

జిల్లాలో మూడు లక్షల జీవాలకు పీపీఆర్‌ టీకాలు

  • జేడీఏ ఎల్లన్న

ఆర్మూర్‌ : ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా మూడు లక్షల జీవాలకు ఉచితంగా పీపీఆర్‌ టీకాలు వేస్తామని జిల్లా పశు సంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎల్లన్న తెలిపారు. మండలంలోని చేపూర్‌లో పీపీఆర్‌ టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్లన్న మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద పశువుల పెంపకందారులకు షెడ్లు, నీటి తొట్టెలు, గడ్డి పెంపకానికి రాయితీలను మంజూరు చేస్తూ నిర్మాణం చేస్తుందన్నారు. జిల్లాలో విజయ డెయిరీ పాలు అమ్మే మూడు వేల మంది లబ్ధిదారులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను బ్యాంకుల ద్వారా ఇప్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ ఎంపీపీ పస్క నర్సయ్య, చేపూర్‌ సర్పంచ్‌ సాయన్న, ఎంపీటీసీ బాల్‌నర్సయ్య, మండల పశువైద్యాధికారి లక్కం ప్రభాకర్‌, పశు పెంపకందారుల మండల అధ్యక్షుడు తోట భాజన్న, గ్రామ అధ్యక్షుడు కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి 

ముప్కాల్‌: రాష్ట్రం ప్రభుత్వం పాడి రైతులకు అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్‌ ఎల్లన్న అన్నారు. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్‌లో మంగళవారం పారుడు వ్యాధి నిరోధక టీకాలను వేసే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 25వ తేదీ వరకు టీకాలు వేస్తామని చెప్పారు. జడ్పీటీసీ లావణ్య, సర్పంచ్‌ గోవర్ధన్‌గౌడ్‌, మండల పశువైద్యాధికారి సంపత్‌ తదితరులు పాల్గొన్నారు. 

టీకాలు వేయించాలి ..

నవీపేట: ప్రతి మూడు, ఆరు నెలల గొర్రె పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని మండల పశువైద్యాధికారులు రతన్‌, నరేందర్‌ సూచించారు. మండలంలోని అనంతగిరి గ్రామంలో పీపీఆర్‌ టీకాల శిబిరాన్ని వారు ప్రారంభించి, గొర్రె పిల్లలకు టీకాలు వేశారు.సర్పంచ్‌ రాజశేఖర్‌రెడ్డి, గొర్రెలు, మేకల పెంపకందారులు పాల్గొన్నారు.


logo