శనివారం 04 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 22, 2020 , 01:16:32

నీటి ఎద్దడికి ‘చెక్‌'డ్యాంలు !నీటి ఎద్దడికి ‘చెక్‌'డ్యాంలు !

నీటి ఎద్దడికి ‘చెక్‌'డ్యాంలు !నీటి ఎద్దడికి ‘చెక్‌'డ్యాంలు !

గోదావరి నదీమతల్లికి సరికొత్త నడకను నేర్పిన సీఎం కేసీఆర్‌ మరో సంకల్పానికి ప్రతినబూనారు. ప్రపంచంలోనే అత్యద్భుతమైన సాంకేతికతతో, అతి తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసిన సీఎం కేసీఆర్‌

  • చింతల్‌నాగారం, బీర్కూర్‌లో ఆనకట్టల నిర్మాణాలు
  • రూ.44.27 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • చెక్‌డ్యాంలతో పెరగనున్న భూగర్భ జలం, బోరుబావులకు ఊపిరి
  • వాన నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ముందడుగు
  • బాన్సువాడ, బీర్కూర్‌, మద్నూర్‌ మండలాలకు ప్రయోజనం
  • మంజీర నదికి జల కళ తీసుకువస్తున్న సభాపతి పోచారం

 తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 1200 చెక్‌ డ్యాంలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వానాకాలం సీజన్‌లో రాలిన ప్రతి చినుకును ఒడిసి పట్టేందుకు భారీ ప్రణాళికలు రచించారు. ఇందుకోసం వాగులు, వంకలు, ఉప నదులపై చెక్‌ డ్యాంలను నిర్మించి వాన నీటిని నిల్వ చేయాలని నీటి పారుదల శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఫలితంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని మంజీర నదిలో రెండు చెక్‌ డ్యాంల నిర్మాణానికి పరిపాలన అనుమతులు వచ్చాయి. ఇందుకోసం రూ.44.27 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. నేడో, రేపో టెండర్లు పిలిచేందుకు నీటి పారుదల శాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారు. గరిష్టంగా 9 నెలల కాలంలోనే బీర్కూర్‌, బాన్సువాడలో చెక్‌డ్యాం నిర్మాణాలను పూర్తి చేసి స్థానిక రైతులకు మేలు చేకూర్చనున్నారు. 

- కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ


కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  ఏటా వర్షాకాలం వచ్చిందంటే చెరువులు, కుంట లు, వాగులు, వంకలు వరద నీటితో జలకళ సంతరించుకుంటాయి. భారీ వర్షాలు కురిస్తే తటాకాలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. తద్వారా  వృథా జలాలు దిగువకు వెళ్లి నదుల ద్వారా సముద్రంలో కలుస్తున్నాయి. వానాకాలం దాటితే చెరువులు, కుంటల్లో చుక్క నీరు ఉండడం లేదు. అతివృష్టి సమయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంటున్న ది. ఇలాంటి పరిణామాలను అధిగమించేందుకు వానాకాలంలో వరద నీటిని ఒడిసిపట్టే చర్యలకు సీఎం ఆదేశాలతో నీటి పారుదల అధికారులు శ్రీ కారం చుట్టడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతున్నది. చెక్‌ డ్యాంల ద్వారా నీటిని నది పరివాహక ప్రాంతాల్లో నిల్వ చేయడంతో చుట్టూ కిలో మీటర్ల కొద్దీ భూగర్భ జలాలు వృద్ధిలోకి రావడం తో బోరు బావుల్లో పుష్కలంగా జల సంపద ఉం టుంది. ఫలితంగా రైతులకు సాగు ఇక్కట్లు పూర్తి గా తొలగి సాఫీగా పంటలు పండించుకునే వెసులుబాటు కలుగనుంది. చింతల్‌నాగారం, బీర్కూర్‌లో చెక్‌ డ్యాం నిర్మాణాలతో బాన్సువాడ, బీ ర్కూర్‌, మద్నూర్‌ మండలాల్లోని గ్రామాలకు ప్రయోజనం చేకూరనుంది.


త్వరలోనే టెండర్లు పూర్తి...

బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో మంజీర నది పై రెండు చెక్‌ డ్యాంల నిర్మాణానికి పరిపాలనా  అనుమతులు మంజూరయ్యాయి. 9 నెలల కాల పరిమితిలోనే రూ.44.27 కోట్లతో బీర్కూర్‌, బా న్సువాడలో ఆనకట్టలను నిర్మించేందుకు నేడు టెండర్లు పిలిచేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. వారం రోజుల్లోనే టెండర్ల ప్రక్రియ ను పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టెండర్లు ఖరారు కాగానే పనులను ప్రారంభించి వానాకాలం సీజన్‌లో వాన నీటిని ఒడిసి ప ట్టేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. చెక్‌డ్యాంలను వేసవి కాలంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వానాకాలం నాటికి నీటిని నిల్వ చేసుకునేందుకు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. బీర్కూర్‌ లో నిర్మించనున్న చెక్‌డ్యాంకు రూ.15.98కోట్లు మంజూరు అయ్యాయి. ఇక్కడ 32 మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్‌(ఎమ్‌సీఎఫ్‌టీ) సామర్థ్యంలో జలాలను నిల్వ చేయనున్నారు. 100 మీటర్ల పొడవుతో దీని నిర్మాణం చేపట్టబోతున్నారు. బాన్సువాడ మండలంలోని చింతల్‌నాగారంలో నిర్మించబోతున్న చెక్‌డ్యాం 1500 మీటర్ల పొడవుతో 64 మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్‌(ఎమ్‌సీఎఫ్‌టీ) సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.28.29 కోట్లు వెచ్చించనున్నారు.


ఉబికి రానున్న భూగర్భ జలం...

చెక్‌ డ్యాం నిర్మాణాల టెండర్ల ప్రక్రియను పూర్తి చేసుకుంటే పనులు ప్రారంభించడమే తరువాయి గా మిగిలింది. నిర్మాణాలు ప్రారంభమైతే వచ్చే ఏ డాది వర్షాకాలంలో అందుబాటులోకి రానున్నట్లు గా అధికారులు చెబుతున్నారు. దీంతో చెక్‌డ్యాంల నిర్మాణంతో పరిసరాల్లోని కిలో మీటర్ల వరకు బో రు బావుల్లో భూగర్భ జలమట్టాలు పెరగడంతో పాటు నది అనుసంధానంగా ఉన్న పరీవాహక ప్ర దేశాల్లో నిరంతరాయంగా నీరు నిల్వ ఉండేందుకు తోడ్పడుతుంది. 

సాగుకు నీటి కొరత సమస్య దూ రం కానుంది. దీంతో రైతులు మరింత ఉత్సాహం గా పొలం పనులు కొనసాగించేందుకు ఆస్కారం ఉంటుంది. కామారెడ్డి జిల్లాలో నీటి పారుదల శా ఖ ఆధ్వర్యంలో1500 చెరువులు ఉన్నాయి. వీటి లో చాలా వరకు కాల్వలు ధ్వంసమై, తూములు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో నాలుగు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చెరువులకు మరమ్మతు చర్యలు చేపట్టారు. రూ.361.31 కోట్లతో జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో 1,101 చెరువులను పూడిక తీసి సుందరంగా తీర్చిదిద్దారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో మంజీర నది పరివాహక ప్రాంత రైతులకు మేలు చేకూర్చేందుకు చెక్‌ డ్యాంలు నిర్మిస్తుండడం పై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  


స్పీకర్‌ పోచారం కృషితోనే..  

స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి సహకారం తో బీర్కూర్‌ రైతులకు ఎంతో మేలు జరగనుంది. ఇటీవల ఎండాకాలంలో రైతుల బోర్లు ఎత్తిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెక్‌డ్యాంలు నిర్మిస్తే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. చెరువుల్లో నీరు ఇంకి పోకుం డా, భూగర్భ జలాలు తగ్గకుండా  ఉపయోగాపడతాయి.  

-గుడికొండ లింగం, రైతు (బీర్కూర్‌)నీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం

చెక్‌ డ్యాంల నిర్మాణంతో కేవలం బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్‌ రై తాంగానికి కాకుండా జుక్కల్‌ నియోజకవర్గంలోని బిచ్కుంద, మద్నూర్‌ మండలాల రైతులకు సైతం మేలు చేకూరనుంది. సాగు, తాగునీటి ఇబ్బందులు శాశ్వతంగా పరిష్కారం కా నున్నాయి. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.

 - ఇరాస్‌ సాయిలు, రైతు (బీర్కూర్‌) రైతులకు ఎంతో మేలు

భూగర్భ జలాలు అడుగంటడంతో చెరువుల్లో కనీసం తేమకూడా లేకుండా పోయేది. ఇప్పుడు నిర్మించనున్న చెక్‌డ్యాంలతో భూగర్భ జలాలు అడుగంటి పోకుండా ఉంటాయి. ఎండాకాలంలో సైతం చెరువుల్లో నీరు నిలిచి ఉండే అవకాశం ఉంటుంది.  

- శ్రీనివాస్‌, రైతు (బీర్కూర్‌)భూగర్భ జలాలు ఉబికి వస్తాయి

 భూగర్భ జలాలు ఆశాజనకంగా ఉంటేనే రైతులకు ఇబ్బందులు ఉండవు. చెక్‌ డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు అడుగంటకుండా ఉంటాయి. ఈ ఏడాది ఎత్తిపోయిన మోటార్లు సైతం తిరిగి నీరు పోస్తాయి. చెక్‌ డ్యాంల నిర్మాణం రైతులకు వరంలాంటిది. 

- ఆరె శంకర్‌, రైతు (బీర్కూర్‌)


logo