Encounter | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లోని కుల్గామ్ (Kulgam)లో మంగళవారం భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు (terrorists killed). కుల్గామ్‌లోని రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కిఉన్నారని ముందుగా సమాచారం అందుకున్న భద్రతా దళాలు సోమవారం అర్ధరాత్రి వారి కోసం గాలింపు ప్రారంభించారు. ఈ గాలింపులో ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన భద్రతా దళాలు వారిపై కాల్పులు జరిపి ముగ్గురిని మట్టుబెట్టారు. ప్రస్తుతం అక్కడ గాలింపు కొనసాగుతోంది.
Also Read..
Met Gala | మెట్ గాలాలో గాజా అలజడి.. పాలస్తీనా జెండాలతో నిరసనలు.. పలువురు అరెస్ట్
Met Gala | మెట్ గాలాలో మెరిసిన అలియా భట్, ఈషా అంబానీ.. కస్టమ్ మేడ్ దుస్తుల్లో స్టార్స్ హొయలు
IPL 2024 | ఫ్లైట్ రెండుసార్లు దారి మళ్లింపు.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు