IPL 2024 | ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లకు ఇబ్బందులు తలెత్తాయి. భారీ వర్షం కారణంగా వీరు ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్‌కు సమస్య తలెత్తడంతో ఫ్లైట్‌ను రెండు సార్లు దారి మళ్లించాల్సి వచ్చింది. దీంతో ఆటగాళ్లంతా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ 2024 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఈనెల 11న ముంబై ఇండియన్స్‌తో ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens)లో తలపడనుంది. ఈ నేపథ్యంలో లక్నో నుంచి సోమవారం సాయంత్రం 5:45 గంటలకు ఛార్డర్డ్ విమానంలో (Charter Plane) కోల్‌కతా బయలుదేరింది. 7:25కు ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, అక్కడ సోమవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం పడింది. విమానం ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించలేదు. దీంతో విమానాన్ని అధికారులు గువాహటికి దారి మళ్లించారు.
విమానం గువాహటికి (Guwahati) చేరుకున్న వెంటనే కోల్‌కతా బయల్దేరేందుకు ఫ్లైట్‌కు అనుమతి లభించింది. దీంతో ఫ్లైట్ తిరిగి కోల్‌కతా బయల్దేరింది. అయితే, విమానం అక్కడికి చేరుకోగానే మరోసారి వాతావరణం అనుకూలించలేదు. విమానాన్ని మరోసారి దారి మళ్లించాల్సి వచ్చింది. దీంతో వారణాసి (Varanasi)కి డైవర్ట్ చేశారు. ఇక రాత్రంతా ఆటగాళ్లు అక్కడే బస చేయాల్సి వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత వారంతా తిరిగి కోల్‌కతా వెళ్లనున్నారు. ఈ విషయాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేసింది.
Travel update: KKR’s charter flight from Lucknow to Kolkata diverted to Guwahati due to bad weather ⛈️
Flight currently standing at the Guwahati Airport tarmac. More updates soon pic.twitter.com/XFPTHgM2FJ
— KolkataKnightRiders (@KKRiders) May 6, 2024
Update at 3:00 AM: KKR team would be checking into Varanasi hotel for overnight stay. Return flight to Kolkata TBD on Tuesday (7 May) afternoon. Stay safe, Kolkata 💜
— KolkataKnightRiders (@KKRiders) May 6, 2024
Also Read..
Lok Sabha elections | కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Met Gala | మెట్ గాలాలో మెరిసిన అలియా భట్, ఈషా అంబానీ.. కస్టమ్ మేడ్ దుస్తుల్లో స్టార్స్ హొయలు
Met Gala | మెట్ గాలాలో గాజా అలజడి.. పాలస్తీనా జెండాలతో నిరసనలు.. పలువురు అరెస్ట్