ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jayashankar - Jan 13, 2021 , 01:54:14

తెలంగాణ సంప్రదాయాన్ని కాపాడాలి

తెలంగాణ సంప్రదాయాన్ని కాపాడాలి

కృష్ణకాలనీ, జనవరి 12: మహిళలు తెలంగాణ సంప్రదాయాన్ని కాపాడుతూ కళా రంగంలో ముందుకు సాగాలని వరంగల్‌ రూరల్‌ జడ్పీ చైర్‌ పర్సన్‌ గండ్ర జ్యోతి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి మహిళలు తెలంగాణ సంప్రదాయాన్ని కాపాడుతూ కళా రంగంలో ముందుకు సాగాలని వరంగల్‌ రూరల్‌ జడ్పీ చైర్‌ పర్సన్‌ గండ్ర జ్యోతి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి  భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్‌ రూరల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై ముగ్గులను పరిశీలించారు. అనంతరం గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. 

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో..

ములుగురూరల్‌/చిట్యాల, జనవరి12: ములుగు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందించారు. చిట్యాల మండలం నైన్‌పాక గ్రామ నాపాక ఆలయ ఆవరణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు ఆలయ కమిటీ చైర్మన్‌ బీరవోలు రాంరెడ్డి బహుమతులు అందజేశారు.


VIDEOS

logo