సోమవారం 30 మార్చి 2020
Jayashankar - Feb 14, 2020 , 04:12:56

గట్టమ్మ హుండీల ఆదాయం రూ. 6,03,328

గట్టమ్మ హుండీల ఆదాయం రూ. 6,03,328

ములుగురూరల్‌, ఫిబ్రవరి 13 : ములుగు జిల్లా కేంద్రం జా కారం గ్రామపంచాయతీ పరిధి గట్టమ్మ దేవాలయం వద్ద మేడా రం జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు కా ర్యక్రమాన్ని గురువారం జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో చేపట్టారు. ముఖ్యఅతిథిగా ఆర్డీవో రమాదేవి హాజరై త హసీల్దార్‌ సత్యనారాయణస్వామి, ఎస్సై బండారి రాజు, జాకా రం గ్రామ సర్పంచ్‌ దాసరి రమేశ్‌, గ్రామస్తుల సమక్షంలో హుం డీల తాళాలను తీసి డబ్బులను ట్రేలలో పోశారు. ఈ మేరకు రెవెన్యూ సిబ్బంది అధికారుల పర్యవేక్షణలో భక్తులు హుండీలలో వేసిన కానుకలను లెక్కించారు. ఉదయం నుంచి రాత్రి వరకు లెక్కింపు పూర్తయ్యే సరికి రూ.6,03,328ల ఆదాయం సమకూరినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. రెండు విదేశీ కాయిన్స్‌తోపాటు 6తులాల వెండి హుండీలలో వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా అధికారులు వీడియో రికార్డింగ్‌ ద్వారా లెక్కింపును చేపట్టి భారీ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో డీటీ రవీందర్‌, ఆర్‌ఐ రజాక్‌, ఏఆర్‌ఐ ఆఫ్రీన్‌, వీఆర్వోలు సూరయ్య, నాగరాజు, రవి, నాగరాజు, సునీత, వీఆర్‌ఏలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 


logo