e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home జనగాం యువతకు ఆదర్శం కేటీఆర్‌

యువతకు ఆదర్శం కేటీఆర్‌

‘హరితహారం’తోనే సమృద్ధ్దిగా వర్షాలు
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
జిల్లా వ్యాప్తంగా మంత్రి జన్మదిన వేడుకలు
కేక్‌ కట్‌ చేసి సంబురాలు

ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటిన నాయకులు, ప్రజాప్రతినిధులు
భూపాలపల్లి/భూపాలపల్లి టౌన్‌/ కృష్ణకాలనీ/ రేగొండ, జూలై 24: సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో హరితహారం చేపట్టి విరివిగా మొక్కలు నాటి సంరక్షించే కార్యక్రమం చేపట్టడం వల్ల ఈరోజు పచ్చదనం పెంపొంది రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా శనివారం భూపాలపల్లి ఏరియా సుభాశ్‌కాలనీ సమీపంలో సింగరేణి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఏరియా జీఎం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, వరంగల్‌ రూరల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి హాజరై మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఏరియాలో 40వేల మొక్కలు నాటామని జీఎం చెప్పారు. ఆజంనగర్‌లో కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, డీఆర్డీఏ పీడీ పురుషోత్తం, డీపీవో ఆశాలత, ప్రజా ప్రతినిధులు పీహెచ్‌సీ ఆవరణలో 400 మొక్కలు నాటారు. మంజూర్‌నగర్‌ నుంచి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ సెంటర్‌ వరకు వేలమందితో ర్యాలీగా వచ్చారు. పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. టీజేఎస్‌ఎఫ్‌, జిల్లా యువజన, క్రీడల శాఖ, తెలంగాణ ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌, టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్‌లను ఎమ్మెల్యే గండ్ర, సతీమణి జ్యోతితో కలిసి కట్‌ చేశారు. మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రేగొండ మండలం చెన్నాపూర్‌ నుంచి జిల్లా కేంద్రం వరకు జాతీయ రహదారికి ఇరువైపులా సుమారు 40కి లో మీటర్ల పొడవునా మొక్కలు నాటుతున్నామని తెలిపారు.

అనంతరం జిల్లా యువజన, క్రీడల శాఖ, తెలంగాణ జాగృతి, ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్‌ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 300 మంది క్రీడాకారులకు వాలీబాల్‌ కిట్లు అందజేశారు. డీఎఫ్‌వో భూక్యా లావణ్య, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ కళ్లెపు శోభ, భూపాలపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, టీబీజీకేఎస్‌ నేత కొక్కుల తిరుపతి, ఎంపీపీ లావణ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ సంపత్‌ కుమార్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ కొత్త హరిబాబు, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి బుర్ర సునీ త, సింగరేణి అధికారులు విజయప్రసాద్‌, వెంకటేశ్వర్‌రావు, రామలింగం, సత్యనారాయణ, రవీందర్‌, అజ్మీరా తుకారాం, కృష్ణప్రసాద్‌, అనురాధ, రజినీకుమారి, షరీఫ్‌, సింగరేణీయులు, టీఆర్‌ఎస్‌ అర్బన్‌ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, మండల అధ్యక్షుడు మందల రవీందర్‌రెడ్డి, నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కో ఆప్షన్‌ మెంబర్లు, పార్టీ జిల్లా, మండల, గ్రామ స్థాయి, టీబీజీకేఎస్‌ నాయకులు పాల్గొన్నారు. అలాగే మంగపేటలో నిర్వహించే కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మం డల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కుడుముల లక్ష్మీనారాయణ, గుండేటి రాజుయాదవ్‌, మాజీ జడ్పీటీసీ వైకుంఠం, కోదండం, సహకార సంఘం డైరెక్టర్లు సిద్ధంశెట్టి లక్ష్మణ్‌రావు, నర్రా శ్రీధర్‌, మండల అధికార ప్రతినధి కటికనేని సత్యనారాయణ, మండల మహిళా అధ్యక్షురాలు కాటూరి సుగుణ, గ్రామాల అధ్యక్షులు లింగయ్య, ఈదునూరి రవీందర్‌, మండవ రామకృష్ణ, గోస్కుల లక్ష్మి, పద్మావతి, అనురాధ, పంపన పార్వతి, భాగ్యలక్ష్మి, పాషా, సత్యనారాయణ, ఖూర్బాన్‌అలీ, వసురాంనాయక్‌, వెంకట్‌రెడ్డి, సాం బయ్య, శ్రీనివాస్‌, విజయరావు, నాగేశ్వర్‌రావు, శ్రీహరి, హరీశ్‌, నరహరి, ప్రశాంత్‌, సూఖ్య, సంపత్‌ పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా వేడుకలు
ములుగురూరల్‌/ మల్హర్‌/ తాడ్వాయి/ గోవిందరావుపేట/ మంగపేట/ కాటారం/ఏటూరునాగారం/కన్నాయిగూడెం/ మహాముత్తారం/పలిమెల/ మహదేవపూర్‌/ వెంకటాపూర్‌/ వెంకటాపూర్‌ (నూగూరు)/ చిట్యాల/ టేకుమట్ల/ గణపురం/ వాజేడు/ కాళేశ్వరం/ మొగుళ్లపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలను టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఘనంగా జరుపుకున్నారు. కేక్‌లు కట్‌ చేసి, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దవాఖానల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana