రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో విజేతలకు అభినందన

జనగామ టౌన్, జనవరి 19 : ఇటీవల నల్లగొండలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన జనగామ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులను ఇన్చార్జి ప్రిన్సిపాల్ పూజారి వెంకటేశ్వర్లు, కళాశాల స్పోర్ట్స్ ఇన్చార్జి మరిపెల్లి రవిప్రసాద్ అభినందించారు. మంగళవారం కళాశాలలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కళాశాల విద్యార్థి గాజర్ల ఉదయ్ కిరణ్ 800 మీటర్ల పరుగుపందెంలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం, 1500 మీటర్ల పరుగుపందెంలో తృతీయ స్థానంలో నిలిచారని తెలిపారు. ఇదే కళాశాల వి ద్యార్థి వాంకుడోత్ అనిల్ సూర్యాపేటలో జరిగిన షాట్పుట్ విభాగంలో రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానంలో నిలిచాడని వారు పేర్కొన్నారు. విజేతలకు పూజారి వెంకటేశ్వర్లు మెడల్స్తోపాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్య క్ర మంలో కళాశాల అధ్యాపకులు గుమ్మడి శృతి, వరూధిని, రేఖ, ఇశ్రాత్ భాను, రంగన్న, ఇంతి యాజ్ తదితరులు పాల్గొన్నారు.