శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 17, 2021 , 01:16:17

గ్రామీణ క్రీడలకు తెలంగాణ సర్కారు ప్రోత్సాహం: జడ్పీటీసీ

గ్రామీణ క్రీడలకు తెలంగాణ సర్కారు ప్రోత్సాహం: జడ్పీటీసీ

కొడకండ్ల, జనవరి 16 : క్రీడలతో స్నేహభావం పెంపొందడంతోపాటు మానసిక ఒత్తిడి దూరమవుతుందని జడ్పీటీసీ కేలోత్‌ సత్తెమ్మ అన్నారు. మండల కేంద్రంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం ఆమె పోటీలను పరిశీలించారు. ఈ సందర్భంగా సత్తెమ్మ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులకు చేయుతనిస్తున్నదన్నారు. వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరై పోటీల్లో పాల్గొనడం ఆనందకరమన్నా రు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పాలకుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్‌ దేశగాని సతీశ్‌, ఉప సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు  పాలెపు సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo