శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 07, 2021 , 03:57:31

పల్లెప్రగతి పనులు పూర్తి చేయాలి

పల్లెప్రగతి పనులు పూర్తి చేయాలి

  • పూర్తయిన వాటికి సత్వరమే బిల్లుల చెల్లింపు సీఈవో రమాదేవి

జఫర్‌గఢ్‌, జనవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిపనులను త్వరిగతిన పూర్తి చేయాలని జడ్పీ సీఈవో రమాదేవి అన్నారు. మండలంలోని ముగ్దుంతండాలో బుధవారం నిర్వహించిన పల్లెప్రగతి గ్రామసభకు సర్పంచ్‌ లక్ష్మి అధ్యక్షత వహించగా ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి పనులు నాణ్యతగా ఉండాలని కోరారు. పూర్తయిన వాటికి వెంటనే బిల్లులు చెల్లించాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్‌ స్వామి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు పరిశీలించిన ఎంపీపీ

పాలకుర్తి రూరల్‌ : సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంపీపీ నల్లా నాగిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మంచుప్పులలో పల్లెప్రగతి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభకు సర్పంచ్‌ బొమ్మగాని కొమురయ్య అధ్యక్షత వహించగా నాగిరెడ్డి మాట్లాడుతూ పూర్తయిన పనులకు బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. మండల ప్రత్యేకాధికారి, ఏపీడీ నూరొద్దీన్‌ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వనపర్తి ఆశోక్‌కుమార్‌, ఎంపీవో దయాకర్‌, పీఆర్‌ ఏఈ పాషా, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ ప్రశాంతి, ఏపీవో అంబాల మంజుల, శ్రీనివాస్‌, బండపల్లి వెంకన్న, వాసురావు, పంచాయతీ కార్యదర్శి మాలతి పాల్గొన్నారు.

మండెలగూడెంను ఆదర్శంగా తీసుకోవాలి

రఘునాథపల్లి : అభివృద్ధి పనుల అమలులో ముందున్న మండెలగూడెంను ఆదర్శంగా తీసుకోవాలని మండల ప్రత్యేకాధికారి, డీఈవో యాదయ్య అన్నారు. బుధవారం మండలంలోని మండెలగూడెంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాలకనుగుణంగా ప్రతి గ్రామంలో శ్మశానవాటిక, పల్లె ప్రకృతివనం, వైకంఠధామం, డంపిగ్‌ యార్డులను నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హసీం, సర్పంచ్‌ ఉత్తెపు ఉమారాణి-సత్యనారాయణ, ఉప సర్పంచ్‌ పుప్పాల వేణు పాల్గొన్నారు. 

పల్లెప్రగతి పనులు పూర్తి చేయాలి

దేవరుప్పుల : పల్లె ప్రగతి పనులను పూర్తి చేస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని మండల ప్రత్యేకాధికారి, ఉపాధిహామీ ఏపీడీ కొండల్‌రెడ్డి అ న్నారు. మండలంలోని నల్లకుంటలో సర్పంచ్‌ రా జన్న అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఎంపీడీవో ఉమామహేశ్వర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. కొండల్‌రెడ్డి మాట్లాడుతూ పూర్తయిన పనులకు బిల్లులు చెల్లిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అజయ్‌కుమార్‌, టీఏ వేంకటేశ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ పాల్గొన్నారు.

పల్లెల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

బచ్చన్నపేట  :  పల్లెల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని నారాయణపూర్‌ సర్పంచ్‌ మాసపేట రవీందర్‌రెడ్డి అన్నారు. పల్లెప్రగతి గ్రామసభలో ఎంపీడీవో రఘురామకృష్ణ, మం డల ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఎం జ్యోతి, ఈసీ మో హన్‌, ఏఈలు శ్రీనివాస్‌, అరుణారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు.

VIDEOS

logo