గురువారం 28 జనవరి 2021
Jangaon - Oct 17, 2020 , 01:38:06

పాపన్న కోటకు పూర్వ వైభవం తెస్తాం

పాపన్న కోటకు పూర్వ వైభవం తెస్తాం

  • బాధితులకు ఇండ్లు నిర్మించి ఇస్తాం
  • స్వరాష్ట్రంలోనే చారిత్రక కట్టడాల పరిరక్షణ
  • రాష్ట్ర పురావస్తు, పర్యాటక, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
  • ఎంపీ దయాకర్‌, ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి ఖిలాషాపురంలోని పాపన్న కోట పరిశీలన  

రఘునాథపల్లి అక్టోబర్‌ 16 : రాష్ట్రంలో సర్దార్‌ సర్వాయి పాపన్న నిర్మించిన పురాతన కోటలకు పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట్ర పురావస్తు, పర్యాటక, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని ఖి లాషాపురంలో బహుజన వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న 18వ శతాబ్దంలో నిర్మించిన కోట గోడ కూలింది. సీఎం కేసీఆర్‌ ఆ దేశాల మేరకు ఎంపీ పసునూరి దయాక ర్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య తో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శుక్రవా రం ఖిలాషాపురం కోటను సందర్శించా రు. కోటలోని పరిసరాలను పరిశీలించి గో డలు కూలడానికి గల కారణాలను గ్రామస్తులు, అధికారులను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తె లంగాణ వీరుల చరిత్రను లండన్‌ గ్రంథాలయంలో భద్రంగా ఉంచితే, సీమాంధ్రు లు వీరుల చరిత్రను విస్మరించి తెలంగాణలోని గుట్టలు, భూములను గ్రానైట్‌ వ్యా పారులకు లీజుకు ఇచ్చి రాష్ర్టానికి తీరని అ న్యాయం చేశారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం వీరులను గుర్తించి వారి జయంతి, వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తూ అన్యాక్రాంతమైన చారిత్రక సంపదను కాపాడుతున్నదన్నారు. గోడ కూలి ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇండ్లు నిర్మిస్తామని మంత్రి హామీనిచ్చారు.

అంతకు ముందు మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడి యం శ్రీహరి ఖిలాషాపురం కోటను సందర్శించారు. గబ్బెట, కన్నాయపల్లి, రామన్నగూడెం, కోడూరు, చీటూరు, గోవర్ధనగిరి, అశ్వరావుపల్లి చర్లతండా, కుసుంబాయితండాలకు రూ. 15 కోట్లతో బీటీ  లిం క్‌ రోడ్డుకు ప్రతిపాదనలు రూపొందించిన ట్లు కడియం తెలిపారు. కార్యక్రమంలో క లెక్టర్‌ నిఖిల, ఆర్డీవో మధుమోహన్‌, టూ రిజం కార్యదర్శి శ్రీనివాస్‌రాజ్‌, డిప్యూటీ డైరెక్టర్‌ నారాయణ, టూరిజం అధికారి శి వాజీ, తహసీల్దార్‌ బన్సీలాల్‌, సర్పంచ్‌ శ్రీ ధర్‌, ఎంపీటీసీ కృష్ణ, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు పోకల శివకుమార్‌, టీ ఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కుమార్‌గౌడ్‌, మహిళా అధ్యక్షురాలు సునీత, నాయకు లు కుర్ర కమలాకర్‌, నామల బుచ్చయ్య, మారుజోడు రాంబాబు, లోనె శ్రవణ్‌, బొల్లపల్లి వెంకటస్వామి, మంద రమేశ్‌, భిక్షపతి నాయక్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.  


logo