మంగళవారం 09 మార్చి 2021
Jangaon - Oct 05, 2020 , 06:26:22

రోడ్డు మరమ్మతు పనులు పరిశీలించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

రోడ్డు మరమ్మతు పనులు పరిశీలించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

జనగామ క్రైం, అక్టోబర్‌ 4 : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లతో పాటు వరంగల్‌-హైదరాబాద్‌ రహదారిపై పలుచోట్ల గుంతలు ఏర్పడగా సంబంధిత అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో రోడ్డు మరమ్మతు పనులను జనగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారీ వర్షాలతో రహదారిపై పలుచోట్ల గుంతలు ఏర్పడడంతో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని అన్నారు. సమస్య తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రోడ్లపై గుంతలు పడిన చోట మరమ్మతు పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారని తెలిపారు. దీంతో మరమ్మతు పనులు చేపట్టారని జమున వివరించారు. ఆమె వెంట ఎస్సై కాసర్ల శ్రీనివాస్‌, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నాయకులు పోకల లింగయ్య, కాంట్రాక్టర్‌ శశిధర్‌ తదితరులు ఉన్నారు.


VIDEOS

logo